Breaking : జగన్ సర్కార్కు సుప్రీం ఝలక్..!!
సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది.