Accident : రోడ్డుపై ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని మహిళపై దాడి..

పూణేలోని రోడ్డుపై తన పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్‌టేక్‌ చేసేందుకు దారి ఇవ్వలేదని కారులో వెనకాలే వస్తున్న మరో వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. దీంతో పోలీసులు నిందితుడితో పాటు అతనితో ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు.

New Update
Accident : రోడ్డుపై ఓవర్‌టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదని మహిళపై దాడి..

Road Accident : పూణే (Pune) లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ.. ఓవర్‌టేక్‌ చేసేందుకు దారి ఇవ్వలేదని కారుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పషన్‌-బనీర్‌ లింక్‌ రోడ్డుపై ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు. నిందితుడితో పాటు అతనితో ఉన్న మరో మహిళను అరెస్టు చేశారు. ఇన్‌స్టాలో ఆమె ఈ విధంగా వివరించింది. ' మేము బైక్‌పై వెళ్తుండగా.. ఓ పెద్దాయన రెండు కిలోమీటర్ల వరకు మా వెనకాల వచ్చారు. ఆ తర్వాత వేగంగా వెళ్లి.. లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని నా బైక్‌కు అడ్డుతగిలారు.

Also Read: భారత్ లో కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువట.. షాకింగ్ రిపోర్ట్! 

కారులో నుంచి కోపంతో దిగి.. నన్ను రెండుసార్లు మొహంపై కొట్టాడు. నా జుట్టుపట్టుకొని లాగాడు. నా పిల్లలు ఉన్నా కూడా వాళ్లను కేర్ చేయలేదు. ఈ నగరంలో భద్రతా ఉందా ? ప్రజలు ఇలా ఉన్మాదంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు ? అతడు చేసిన పనికి శిక్ష పడాలని కోరుతున్నాను' అంటూ రాసుకొచ్చింది. ఈ విషయం పూణే పోలీసులు దృష్టికి వెళ్లడంతో.. ఆ వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యక్తితో పాటు అతడితో ఉన్న మరో మహిళను కూడా అరెస్టు చేసారు. ఇటీవల పూణేలో హిట్ అండ్ రన్‌ కేసులు (Hit & Run Cases) జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటన జరిగింది. కొన్ని నెలల క్రితం.. పార్షే కారులో వేగంగా వెళ్తున్న ఓ మైనర్‌ బాలుడు.. బైక్‌ను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లు మృతి చెందారు.

Also read: కరెంట్‌ బిల్లు రూ.4 కోట్లు.. ఇంటి ఓనర్ షాక్

Advertisment
తాజా కథనాలు