సోషల్ మీడియాలో రీల్ కోసం ఓ యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని బైక్ హ్యాండిల్స్ వదిలేసింది. డ్యాన్స్ మూమెంట్లతో పాటు రోజా పువ్వుతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మాధవి కుంభార్ అనే యువతి సోషల్ మీడియాలో బైక్ వీడియోలకు సంబంధించి పోస్టులు చేస్తుంది. ఈమెకు ఇన్‌స్టాలో 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా మాధవి చేసిన డేంజర్ బైక్ స్టంట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్.. తేదీ ఖరారు