Crime: 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు!

పుదుచ్చేరిలో డ్రైనేజీలో 9 ఏళ్ల బాలిక మృతదేహం దొరకడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అనుమానస్పదంగా ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు.

Crime: 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం, హత్య? ..కాళ్లు చేతులు కట్టేసి డ్రైనేజీలో పడేసిన దుర్మార్గులు!
New Update

9 Year Old Girl Puducherry: పుదుచ్చేరిలో హృదయాన్ని పిండేసే ఘటన ఒకటి వెలుగు చూసింది. కొందరు దుండుగులు 9 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఆమె ఇంటి వద్దనే ఉన్న డ్రైనేజీలో కాళ్లు చేతులు కట్టి పడేశారు. కుళ్లిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహన్ని పోలీసులు రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. దుండగులు పాపను కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడి , హత్య చేసి ఉండొచ్చని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాలిక మృతదేహం దొరికిన తరువాత పోలీసులు అనుమానితులైన ఐదుగురిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటుండగా కిడ్నాప్‌ కి గురైనట్లు సీసీటీవీలో రికార్డు అయ్యింది.

బాలికను తీసుకుని వెళ్లిన ఇద్దరు నిందితులు వివేకానందన్‌ (56), కరుణాస్‌ (19) అనే వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మరెవరిది అయినా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక సిట్‌ ను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి నమఃశివాయం తెలిపారు.

అరెస్టు చేసిన వ్యక్తులపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టాలు, హత్య, కిడ్నాప్‌ల కింద కేసు నమోదు చేసినట్లు హోంమంత్రి ఎ నమశ్శివాయం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం-హత్య విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

“పుదుచ్చేరిలో 9 ఏళ్ల బాలికపై జరిగిన దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నింటికంటే, దేశంలో ఆడపిల్లలపై నేరాల సంఘటనలు ఎందుకు నిరంతరం పెరుగుతున్నాయి? 2022లోనే మహిళలపై 4.5 లక్షల నేర ఘటనలు చోటుచేసుకోగా, అందులో 31 వేల కేసులు అత్యాచారానికి సంబంధించినవే” అని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి బాలిక కుటుంబానికి ₹ 20 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నిందితులపై త్వరలో ఛార్జిషీటు వేయడం జరుగుతుందని, ప్రాసిక్యూషన్ నిందితులకుకఠినంగా కోర్టు శిక్ష విధించేలా చూస్తుందని హామీ ఇచ్చారు.

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదే సమయంలో, కేసును పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. జస్టిస్‌ ఫర్‌ ఆరతి అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి అన్నాడీఎంకే సభ్యులు శుక్రవారం బంద్‌ కు పిలుపునిచ్చారు.

పుదుచ్చేరిలో 9 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, నేరస్థులు ఆమె మృతదేహాన్ని చేతులు, కాళ్లు కట్టి కాలువలో వదిలేశారని విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అన్నారు. ప్రజలు తమ స్వరం పెంచుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ ఎవరైనా వింటారా? ఇలాగే ఆడపిల్లల హత్యలు ఇంకెన్నాళ్లు? వార్తాపత్రిక పేజీలు తిరగేసినా కథ మాత్రం అలాగే ఉంది. దేశంలో రామరాజ్యం ఎలా వస్తుంది? అంటూ ఆమె ప్రశ్నించారు.

Also read: పబ్లిక్ లో కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని..నటి ఏమన్నారంటే!

#bjp #tamilisai #puducherry #crime #aap
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe