Duvvuri : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు(Duvvuri Subbarao) పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఉచిత హామీలు, దేశ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ' ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీ(Political Parties) లపై ఆంక్షలు ఎలా విధించాలనే విషయంపై చర్చ జరగాలి. ఈ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి. దీనికోసం ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని. దీనికి సంబంధించి ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి. ఉచిత హామీలకు అయ్యే ఖర్చు, వాటి ప్రయోజనాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భారత్ వంటి పేద దేశంలో బలహీనవర్గాలకు కొన్ని భద్రత కల్పించాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు విస్తరించవచ్చనేది సమీక్షించుకోవాలి.
Also read: ఇంటర్ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారికి గుడ్ న్యూస్..8వేల ఉద్యోగాలను ప్రకటించిన రైల్వేస్
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణా పాటించాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కచ్చితంగా కట్టుబడి ఉండాలి. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఏడాది.. 7.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. చైనా లాంటి పలు దేశాలు దీన్ని సాధించగలిగాయి. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాల వంటి సవాళ్ల నడుమ భారత్(India) దాన్ని ఎంతవరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టం.
అభివృద్ధి చెందిన దేశానికి బలమైన ప్రభుత్వం, చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య జవాబుదారీతనం, పటిష్ఠ సంస్థలు అనేవి నాలుగు స్తంభాల్లాంటివి. ఈ నాలుగు మనకు లేవని అనలేం. అలాగే అవన్నీ ఉన్నాయి అని అనుకోలేని పరిస్థితి కూడా ఉంది. వాటిని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బరావు' వివరించారు.
Also Read: కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త