Puja Khedkar: దోషిగా నిరూపించేవరకు నేను నిర్దోషినే- పూజా ఖేద్కర్

ఫుల్ కాంట్రవర్శీల్లో ఇరుక్కున్న ట్రెయినీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేద్కర్ మొదటిసారి మీడియాతో మాట్లడారు. దోషిగా తేలంత వరకు అందరూ నిర్దోషులేనని...మీడియా కథనాల ఆధారంగా తనను దోషిగా తేల్చేయడం తప్పని ఆమె అన్నారు. మరోవైపు పూజా తల్లిదండ్రుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
Puja Khedkar: దోషిగా నిరూపించేవరకు నేను నిర్దోషినే- పూజా ఖేద్కర్

Puja Khedkar: వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ తల్లిదండ్రుల కోసం మహారాష్ట్రలోని పుణె పోలీసులు గాలిస్తున్నారు. ఓ భూ వివాదం వ్యవహారంలో ఆమె తల్లి మనోరమ కొందరిని పిస్టోల్‌తో బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో పూజా తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం బానేర్‌ ప్రాంతంలో మనోరమ, దిలీప్‌ ఖేడ్కర్‌ నివాసానికి వెళ్లారు. లోపలి తలుపులు లాక్‌ చేసి ఉన్నట్లు గుర్తించినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. దీంతో పుణె, ఇతర ప్రాంతాల్లో వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పూజా ఖేద్కర్‌ ఎంబీబీఎస్‌పై వివాదం

పుణెలోని ముల్షి తహసీల్‌ పరిధిలోని ధద్వాలి గ్రామంలో భూవివాదం విషయంలో మనోరమ తన సెక్యూరిటీ గార్డులతో కలిసి పిస్టోల్‌తో బెదిరింపులకు దిగినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వ్యవహారంలో ఖేడ్కర్ దంపతులతో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచినా ఆ దంపతులు రాలేదని, మొబైల్‌ ఫోన్లు స్విచాఫ్‌ చేశారని పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

మరోవైపు మొదటిసారి మీడియాముందుకు వచ్చిన పూజా ఖేద్కర్ ఒక వ్యక్తి దోషిగా తేలేంతవరకు నిర్దోషినే. అలా అని మన రాజ్యాంగమే చెప్పింది. కేవలం మీడియా తన కథనాల ద్వారా నన్ను దోషిగా చూపించడం సరికాదని అన్నారు. ఆరోపణలు చేయవచ్చును కానీ...తనను దోషిగా చూపించడం తప్పని చెప్పారు.

Also Read:Delhi: కేజ్రీవాల్‌కు బెయిన్ స్ట్రోక్-మంత్రి అతిషి

Advertisment
తాజా కథనాలు