Key Directives Of Central Home Ministry : కోల్‌కతా (Kolkata) లోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు (Medical Students) దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకొకసారి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి రిపోర్టులు పంపాలని హోంశాఖ సూచించింది.
Also Read: డ్యామ్‌పై ప్రమాదకర స్టంట్.. యువకుడు మృతి
అక్కడ ఉన్న పరిస్థితులు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం.. అలాగే పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగించినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. హత్యాచారం ఘటన జరిగిన అనంతరం నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అన్ని వైద్య కళాశాలలకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆస్పత్రి పరిసరాల్లో సరైన భద్రతా విధానాన్ని రూపొందించాలని సూచనలు చేసింది. ఓపీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ భద్రతా విధానాలు ఉండేలా చూడాలని చెప్పింది. అలాగే వైద్యలు, సిబ్బంది కారిడర్లలో తిరిగే సమయంలో భద్రత కోసం రక్షణ సిబ్బందిని నియమించాలని తెలిపింది.
Also Read: రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మారుస్తాం : కేటీఆర్