Allu Aravind : ఇండస్ట్రీ మేలుకోసమే కలిశాం.. పవన్ తో భేటీ పై అల్లు అరవింద్!

తెలుగు సినీ నిర్మాత‌లు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఇండస్ట్రీ మేలు కోసమే ఆయన్ని కలిశామని అన్నారు.

Allu Aravind : ఇండస్ట్రీ మేలుకోసమే కలిశాం.. పవన్ తో భేటీ పై అల్లు అరవింద్!
New Update

Producer Allu Aravind : తెలుగు సినీ నిర్మాత‌లు నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో (AP Deputy CM Pawan Kalyan) భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరిగింది. ఇక కొత్త‌గా ఎన్నికైన ప్ర‌భుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ స‌మ‌వేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

publive-image

ఈ భేటిలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులుపాల్గొన్నారు.

publive-image

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్.. ఎందుకో తెలుసా?

కాగా ఈ భేటీ అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు."ఈరోజు మా అందరికీ సంతోషకరమైన రోజు.. కులాసాగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడుకున్నాం. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరాం. అపాయింట్మెంట్ ఇస్తే ఇండస్ట్రీ కి సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడాలని చెప్పాము. ముఖ్యమంత్రితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

publive-image

టికెట్స్ రేట్స్ చాలా చిన్న విషయం. వాటి గురించి ముఖ్యమంత్రి సమావేశంలో మాట్లాడతాం. అలాగే చంద్రబాబు, పవన్ లకు సన్మానం చెయ్యడానికి సమయం అడిగాం. మనస్పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడాం..త్వరలో ఇండస్ట్రీ గురించి రిప్రెండేషన్ ఇస్తాం" అని అన్నారు.

#pawan-kalyan #allu-aravind #producers-meets-pawan-kalyan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe