Amitabh Bachchan : ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్.. ఎందుకో తెలుసా? అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో 'కల్కి' లో ప్రభాస్ కు తనకు మధ్య ఫైట్ సీన్స్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని అన్నాడు. By Anil Kumar 24 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Amitabh Bachchan Says Sorry To Prabhas Fans : ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898AD' మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ సినిమాపై మరింత హైప్ పెంచేసాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుంది. దీంతో సినీ లవర్స్ మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూడాలా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ కు మూడు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో టీమ్ అంతా సినిమాకి సంబంధించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. Also Read : బుక్ మై షోలో ‘కల్కి’ ర్యాంపేజ్.. గంటలో అన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయా? నన్ను ట్రోల్ చేయొద్దు... 'కల్కి' సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో, అమితాబ్ బచ్చన్ అశ్వద్థామగా కనిపించబోతున్నారు. కాగా సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ ఫైట్ సీన్స్ గురించే అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని అన్నాడు. ఆయన చెప్పినదాన్ని బట్టి సినిమాలో ప్రభాస్, అమితాబ్ మధ్య యాక్షన్ సీన్స్ భారీగానే ఉంటాయని స్పష్టమవుతుంది. #kalki-interview #amitabh-bachchan #kalki-2898-ad-movie #prabhas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి