YSRCP MLA : తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే(MLA) రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి(Rachamallu Sivaprasad Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమార్తెకు కులాంతర వివాహం(Marriage) చేసి వార్తల్లో నిలిచిన ప్రొద్దుటూరు(Proddutur) ఎమ్మెల్యే రాచమల్లు గురించి అందరికీ తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు(Elections) వస్తున్నాయనగా..రాచమల్లు ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చానీయాంశం అయ్యింది.
కుట్రలు జరుగుతున్నాయి...
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన బలమైన ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
50 లక్షలకు ఒప్పందం...
రాష్ట్రంలో టీడీపీ(TDP) నేతల వ్యక్తిత్వం బలహీనపడుతుందని అని అన్నారు. వైసీపీ(YCP) అభ్యర్థులను ఓడించడానికి బలమైన కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే నా ఫేస్ బుక్(Facebook) ఖాతాను కూడా హ్యాక్ చేసినట్లు ఆయన తెలిపారు. నా ఫోన్ కూడా హ్యాక్ చేయాలని ఆస్ట్రేలియా(Australia) కు చెందిన ఓ వ్యక్తితో 50 లక్షలకు ఒప్పందం జరిగినట్లు నాకు తెలిసింది. ఇప్పటికే ఆ వ్యక్తికి సగం డబ్బులు కూడా ఇచ్చారని రాచమల్లు మీడియాకి వివరించారు.
నా వెనుక రాజకీయ కుట్ర...
నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం నీచమైన చర్య అని పేర్కొన్నారు. అన్ని సాక్ష్యాలు, బలమైన ఆధారాలతోనే నేను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. చివరికి ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి సమాచారం గురించి కూడా పోలీసులకు ఇచ్చాను. నా వెనుక రాజకీయ కుట్ర జరుగుతోంది.
టీడీపీతోనే నా ప్రధాన శత్రుత్వం..
వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు రాజకీయ శత్రువులు మాత్రమే. టీడీపీతోనే నా ప్రధాన శత్రుత్వం అని రాచమల్లు ఆరోపించారు. నా మీద మాత్రమే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వైసీపీ ఎమ్మెల్యేల మీద ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని అనుమానంగా ఉందని అన్నారు. అందుకే మా ఎమ్మెల్యేలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు.
నా మొబైల్ కు అమ్మాయిల నగ్న వీడియోల లింక్ లు పంపి కుట్రలు చేస్తున్నారు. టీడీపీ వారే ఇలా చేయిస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. దీనిపై సమగ్రంగా విచారించాలని ఎస్పీ ని కలిసి విన్నవించా అని రాచమల్లు అన్నారు.
Also read: పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడూ..మేము ఎందుకు పార్టీలో ఉండాలి?