Lotus Flower : శరీరంలోని వేడిని తగ్గించేందుకు కేవలం ఒక్క తామర పువ్వు(Lotus Flower) చాలు. దీనితో మనం వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. తామర పువ్వులోని ఆకులు, కాండం, పువ్వులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆయుర్వేద వైద్యం(Ayurvedic Medicine) లో తామర పువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటిలో ఉండే కాపర్ కంటెంట్ ఎముకల పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
తామర పువ్వు ఉపయోగాలు:
- గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొక్కలోని అన్ని భాగాలు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయి. తామర పువ్వులలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. అంతే కాకుండా తామర పువ్వులలో విటమిన్ సి, బి, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, క్లోరిన్‌లాంటి ఖనిజాలు ఉన్నాయి.
కంటి చూపు:
- ఈ పువ్వులు కంటి వ్యాధులను(Eye Infections) నయం చేయడానికి ఉపయోగపడతాయి. 100 మి.లీ స్వచ్ఛమైన నీటిలో 100 మి.లీ ఆవు పాలు వేసి అందులో తామర రేకులను వేసి మరిగించాలి. ఇలా ఉదయం, సాయంత్రం ఆవిరి పడితే కంటి దోషాలు తొలగిపోతాయి.
తామర పువ్వుల వల్ల లాభాలు:
- ఈ పూలను మామూలు నీళ్లలో వేసి 2 గంటలు మరిగించి వడగట్టి తాటి బెల్లం కలిపి తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ నీళ్లు జ్వరాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్కిన్ ఇరిటేషన్, ఐ ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్(Blood Sugar Levels) తగ్గుతాయి. తామరపువ్వుల వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు ఈ నీటిని తాగవచ్చు.
నూనె:
- ఈ పువ్వుల నుంచి నూనెను తయారు చేస్తారు. తామర ఆకు, పూల రసం, దుంప రసం సమంగా తీసుకుని నెయ్యితో కలిపి చల్లార్చి సీసాలో ఉంచుకోవాలి. దీన్ని వారానికి 2 సార్లు తలకు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టు రాలడం(Hair Fall) అదుపులోకి వస్తుంది. కంటి రుగ్మతలు నయమవుతాయి. అంతేకాకుండా ఈ నూనెను గాయాలపై రాస్తే త్వరగా మానిపోతుంది.
ఇది కూడా చదవండి: ప్రాణాన్ని కాపాడే ఫిష్ ఆయిల్.. వాడితే మీ గుండె సేఫ్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.