South India: రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రియాంక గాంధీ పోటీ?

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకతోపాటు తెలంగాణలోనూ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొప్పల్ నియోజకవర్గంలో సర్వే పూర్తికాగా.. త్వరలోనే తెలంగాణ స్థానంపై క్లారిటీ రానుంది.

New Update
Priyanka Gandhi: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ

PRIYANKA GANDHI: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలోని (South India) రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే AICC స్థానిక కాంగ్రెస్ యూనిట్‌కు సమాచారం ఇవ్వకుండా కర్ణాటకలోని కొప్పల్ (karnataka koppal) నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించింనట్లు సమాచారం. కాగా తెలంగాణలోని మరో స్థానం నుంచి ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ వర్గాలు ఆలోచిస్తున్నాయి. యూపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని సురక్షితమైన సీటులో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నారు.

సానుకూల ప్రభావం..
కర్నాటక నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే, అది కాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అంతేకాదు గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కర్ణాటక నుంచి పోటీ చేస్తే పార్టీకి మేలు జరుగుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గతంలోనే చెప్పారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని కొప్పల్ అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి కాగా ఇక్కడ 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్‌ గెలిచింది. మరోవైపు ఇప్పటికే రాహుల్‌ గాంధీ (Rahul gandhi)  కేరళలోని వయనాడ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి కూడా రాహుల్‌ అమేథితో పాటు వయనాడ్‌ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అలాగే తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియాకు (Sonia gandhi) రాష్ట్ర నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం లేదా మరో స్థానం నుంచి సోనియాను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో వారి దినిపై క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి : Rahul Gandhi: ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ ప్రారంభం.. ఈసారి మణిపూర్‌ – ముంబయి..

కొప్పల్ సురక్షితమైన సీటు..
ఇక ఏఐసీసీ చేపట్టిన సర్వేలో ప్రియాంక గాంధీకి కొప్పల్ సురక్షితమైన సీటుగా సూచించింది. ప్రస్తుతం కొప్పల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కారడి సంగన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా 1978లో కర్నాటక నుంచి చిక్కమగళూరు పార్లమెంటరీ సీటును గెలుచుకున్న తర్వాత రాజకీయ పునర్జన్మ పొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాన్ని ఉడిపి-చిక్కమగళూరు సీటుగా పిలుస్తున్నారు. ఇక్కడ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1999లో కర్ణాటకలోని బళ్లారి స్థానం నుంచి దివంగత సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌పై పోటీ చేసిన సోనియా గాంధీ భారీ పోరులో విజయం సాధించారు. కర్నాటక నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తే, అది కాంగ్రెస్‌కు రాష్ట్రవ్యాప్తంగా సానుకూల ప్రభావం చూపుతుందంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు