Deep Fake Videos Of Priyanka Chopra :సెలబ్రిటీ (Celebrity)ల డీప్ ఫేక్ వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడటం కలకలం రేపుతోంది. ఈ డిప్ ఫేక్ (Deepfake) వీడియోలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా కూడా సినీ నటులు వీటి బారిన పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ బాలివూడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఈ డిప్ ఫేక్ వలలో పడ్డారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రియాంక చోప్రా గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖాన్ని మార్చకుండా.. అందులో వాయిస్‌ను మార్చేశారు కేటుగాళ్లు. ప్రియాంక చోప్రా ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్‌సింక్ అయ్యేలా చేశారు. అంతేకాదు ఆమె తన వార్షిక ఆదాయాన్ని కూడా అందులో వెల్లడించేలా ఆ వీడియోను తయారుచేశారు.
Also Read: తెలంగాణకు ఐటీ మంత్రి ఆయనే.. కేటీఆర్ కంటే డైనమిక్ అంటున్న నెటిజన్లు
ఒక బ్రాండ్‌ను వినియోగించడం 2023లో వార్షిక ఆదాయం భారీగా పెరిగిపోయిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే వాడాలని ప్రియాంక చోప్రా చెప్పేలా వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండంతో మరో డీప్ ఫేక్ వీడియో రావడం దారుణమంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఇటీవల రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో దేశవ్యా్ప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్ వీడియోలు బయటపడ్డాయి. ఇలాంటి వాటికి పాల్పడున్నవారిపై కఠినంగా చర్యలకు తీసుకోవాలని పలువురు ప్రముఖులు ఇప్పటికే డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై స్పందించిన ఐటీశాఖ కూడా.. డీప్ ఫేక్ వీడియోలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది.
Also Read: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ముగ్గురు బీజేపీ పెద్దల మేథోమథనం