Los Angeles: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమె ఇండియాను పూర్తిగా వదిలిపోయేందుకు ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో భాగంగానే భారత్ లో ఉన్న ప్రాపర్టీస్ అమ్మేస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా లాస్ ఎంజెల్స్ లో ఓ ఖరీదై ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తుండగా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
20 మిలియన్ డాలర్లు..
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్ (Nick Jonas)ను వివాహం చేసుకుని యూఎస్‌లో సెటిలైన ఆమె అప్పట్లో.. లాస్ ఏంజిలెస్‌లో 20 మిలియన్ డాలర్లతో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఓ చిన్న ఇష్యూతో ఆ ఇంటి నుంచి దంపతులు బయటకు వచ్చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ మేరకు ఆ ఇంట్లో నీళ్లు లీక్ అవుతుండటంతో చాలా ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయట. దీంతో నష్టపరిహారం ఇప్పించాలని ఆ ఇల్లు అమ్మిన వ్యక్తిపై కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేశారని, ప్రస్తుత ధరల ప్రకారం ఆ ఇంటి విలువ సుమారు రూ.165 కోట్లు పలుకుందట. మరమ్మతులు చేయించడానికి దాదాపు 2.5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని బిల్డర్ట్ అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Tripti: అతనే నాకు కాబోయేవాడు.. పెళ్లి పుకార్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ
అమూల్యమైనదే..
ఇక ఈ ఖరీదైన బంగ్లాలో విలాసవంతమైన ఏడు బెడ్ రూమ్ లు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్ థియేటర్, స్పా, స్టీమ్ షవర్, జిమ్, బిలియర్డ్స్ రూమ్ లాంటివి ఉన్నాయట. పిల్లలతో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదిగా ఉండాలని ప్రియాంక - నిక్ ఆ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని ఇప్పుడు వద్దనుకోవడం చర్చనీయాంశమైంది.