Karnataka: కర్ణాటకలో మరోసారి సీఎం పదవిపై పంచాయితీ

కర్ణాటకలోని కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యమంత్రి పదవీపై పంచాయితీ మొదలైంది. హైకమాండ్‌ తనను సీఎం బాధ్యతలు చేపట్టాలని కోరితే సిద్ధంగా ఉన్నానని మల్లిఖార్జున్‌ ఖర్గే కుమారుడు ఐటీశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

New Update
Karnataka: కర్ణాటకలో మరోసారి సీఎం పదవిపై పంచాయితీ

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీజేపీకి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం కొద్దిరోజుల పాటు తలలు పట్టుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ముందుగా సీఎం పదవీ కోసం పోటీపడ్డారు. చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు అక్కడ మరోసారి పదవుల పంచాయితి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కన్నేశారు.

Also Read: ఆ యూనివర్సిటీలో మహిళను వివస్త్రను చేశారు.. విద్యార్థుల ఆందోళనలు

Also Read: ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే.. జైశంకర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ హైకమాండ్ తనను ముఖ్యమంత్రి బాధ్యతను చేపట్టాలని కోరితే తాను సిద్ధంగా ఉన్నానని ప్రియాంక్ ఖర్గే చేసిన అన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ప్రియాంక్ ఖ‌ర్గే ప్ర‌క‌ట‌న‌తో ఉలిక్కిప‌డిన ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. ఐదు సంవత్సరాల పాటు తానే సీఎంగా ఉంటానని స్ప‌ష్టం చేశారు. రెండున్న‌రేళ్ల త‌ర్వాత సిద్ధ‌రామ‌య్య ప‌దవి నుంచి వైదొల‌గుతార‌ని.. అనంతరం నాయ‌క‌త్వ మార్పు ఉంటుంద‌నే ప్ర‌చారాల న‌డుమ కర్ణాటకలో మరింత ఊహాగానాలు చెల‌రేగుతున్నాయి. ఇక మ‌రోవైపు క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల‌దోసేందుకు బీజేపీ నేతలు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేత‌లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రూ. 1000 కోట్లు ఇవ్వాలని అడిగినట్లు మల్లిఖార్జున్ ఖ‌ర్గే ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు