Telangana Elections 2023:ఫ్యూచర్‌లో బీఆర్ఎస్‌ను మ్యూజియంలో చూస్తారు-ప్రియాంక గాంధీ

New Update
Priyanka Gandhi: బీజేపీని  బొంద పెట్టాలి.. తెలంగాణ పర్యటనలో ప్రియాంక గాంధీ ఫైర్

మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచార కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ ఏర్పాటు అయ్యేదికాదని అన్నారు. ఎవరి భాగస్వామ్యం లేకుండానే మానవత్వంతో ప్రజల కోరిక మేరకు సోనియా తెలంగాణను ఇచ్చారని ప్రియాంక చెప్పారు. గత పదేళ్ళల్లో తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని..బీఆర్ఎస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదని ఆరోపించారు.

Also Read:పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్

తెలంగాణలో యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రియాంక అన్నారు. TSPSC అంతా అవినీతి మయం. విద్యాసంస్థే పేపర్లు అమ్ముకోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఒక్క కుటుంబంలో నలుగురుకి మాత్రమే ఉద్యోగాలు దొరికాయని దుయ్యబట్టారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉపాధి దొరికిందన్నారు. కానీ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ లు కోరుకుంది ప్రజల తెలంగాణా సంక్షేమం...అది మాత్రం నెరవేరలేదు అన్నారు ప్రియాంక.

ఫార్మ్ హౌస్ ఒక్కటే తెలంగాణ కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక యద్దేవా చేశారు. తెలంగాణలో పీడిత ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు ప్రియాంక గాంధీ. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలకు టాటా బాయ్ బాయ్ చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను భవిష్యత్ లో మ్యూజియంలో చూస్తారని అన్నారు.

Also Read:తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ

Advertisment
తాజా కథనాలు