Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా ప్రియమణి..మండిపడుతున్న అభిమానులు! దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రియమణి ఎన్టీఆర్ జంటగా నటించిన యమదొంగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. By Bhavana 27 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి నందమూరి వారుసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్ (NTR) ఎన్నో విజయాలను సాధించి ఆస్కార్ వేదిక మీద కూడా తన సినిమాను నిలబెట్టాడు.ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఇప్పటికీ విదేశాల్లో ఈ సినిమా రిలీజై సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతుంది. జపాన్ లో విడుదలైన ఆర్‌ఆర్ఆర్ రికార్డులు తిరగరాసింది. ఈ క్రమంలోనే నాటునాటు పాట ఆస్కార్ వేదిక పై చిందులు వేసి అవార్డును గెలుచుకుని వచ్చేసింది. ఆస్కార్ గెలుచుకున్న తొలి తెలుగు పాట గా నాటు నాటు ఎంతో ఖ్యాతిని సాధించింది. ఆ చిత్రం తరువాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నాడు. ఇందులో ఆలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ను కూడా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ఆలోచిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఈ చిన్న విషయం అయినా సరే వెంటనే నెట్టింట వైరల్ గా మారిపోతుంది. ఈ సినిమా నుంచి దర్శకుడు విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ అభిమానులు ఇప్పటికీ మరచిపోలేదు. ఇంకా సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ షికారు చేస్తుంది. అది ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా నటి ప్రియమణి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రియమణి ఎన్టీఆర్ జంటగా నటించిన యమదొంగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రియమణి ఎన్టీఆర్ కి తల్లిగా నటించడం అభిమానులకు షాక్ అనే చెప్పవచ్చు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. #koratala-siva #devara #priyamani #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి