PM MODI ప్రధాని మోదీ 11రోజుల దీక్ష ఎందుకంటే..?

ప్రధాని మోడీ ఈనెల 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నట్టు వెల్లడించారు.

PM MODI ప్రధాని మోదీ 11రోజుల దీక్ష ఎందుకంటే..?
New Update

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కల నిజం కాబోతున్నది. రామమందిర (Ayodya Rama Mandhir)ప్రారంభానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Modi) అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా మోడీ కీలక ప్రకటన చేశారు. ప్రాణప్రతిష్ఠ జరిగేంతవరకు తాను ప్రత్యేక అనుష్టానం (దీక్ష) పాటించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన అధికార యూట్యూబ్‌ ఛానల్ లో ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

అమృత ఘడియల్లోనే...

కాగా ఆయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట (Prana Pratishtha)కు 84 సెక్షన్ల అమృత ఘడియలు.. అద్భుత ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వెల్లడించారు. ఆ సమయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగితే దేశానికి శుభసూచకమని ఆయన అభిప్రాయపడ్డారు. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్టు వెల్లడించారు.

ప్రత్యేక పూజలు

విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 4వేలమందికి పైగా సాధువులు, ఋషులు పాల్గొననున్నారు. ఈ నెల 16 నుంచే అయోధ్యలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 22న వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ అధ్వర్యంలో శాస్త్రోత్సంగా లామ్‌లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు.

ముహూర్తబలం

కాగా 22న తెల్లవారుజామున 3.21 నిమిషాల నుంచి 23 తెల్లవారు జాము 4.58 నిమిషాల వరకు మృగశిర నక్షత్రం ఉంది. మృగశిరకు కుజుడు అధిపతి. ఈ నక్షత్రం సోమదేవునిది. సోముడు అమృతత్వానికి సూచిక అని అంటే 22న అమృత సిద్ధయోగం, సర్వార్ధ యోగం ఉన్నాయని రామజన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి మహంత్‌ గోవింద్‌ దేవ్‌గిరి చెప్పారు. కనుక ఆరోజునే రాముడి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలిపారు.

#prime-minister-modi #ayodhhya-ram-mandir #prana-pratishtha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe