PM Modi: మంగళగిరిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను జాతికి అంకితం చేయనున్న మోడీ !

నేడు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌(AIIMS)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌ గా వైద్య విజ్ఞాన సంస్థాన్‌ ను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం ఏపీలో రూ.233 కోట్లతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ల శంకుస్థాపన చేస్తారు.

PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇదే..!
New Update

PM Modi to Dedicate AIIMS Mangalagiri to Nation: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు మంగళగిరి లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థాన్‌ (AIIMS) ను ప్రారంభించనున్నారు. రాజ్‌కోట్‌ నుంచి వర్చువల్‌ (Virtual Mode)గా వైద్య విజ్ఞాన సంస్థాన్‌ ను జాతికి అంకితం చేస్తారు. రూ.1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్‌­ నిర్మించగా ఇందులో 125 సీట్లతో కూడిన మెడికల్ కాలేజీ కూడా ఉంది.

స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌..
అలాగే విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్‌ ఫుడ్‌ ల్యాబ్‌ (Food Testing Lab) క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌, రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను మోడీ ఇనాగ్రేషన్ చేయనున్నారు. అంతేకాదు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కు సంబంధించి రూ.230 కోట్ల విలువైన 9 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను (Critical Care Blocks) సైతం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం, వైఎస్సార్, నెల్లూరు జిల్లా­ల్లోని గవర్నమెంట్ వైద్య కళాశాలల్లో రూ.23.75 కోట్లు, తెనాలి జిల్లా ఆస్పత్రిలో రూ.44.50 కోట్లు, హిందూపూర్‌ జిల్లా ఆస్పత్రిలో రూ.22.25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకులకు కూడా కట్టనున్నారు.

ఇది కూడా చదవండి : Bank Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,025 పోస్టుల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!

ఇప్పటికే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాలను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు అధికారులతో సమీక్షించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ (Abdul Nazeer) ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ భారతీప్రవీణ్‌ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

#pm-modi #mangalagiri #aiims #vidadala-rajini
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe