Prime Minister Modi: వైసీపీకి ప్రధాని మోదీ వార్నింగ్

AP: వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందని అన్నారు ప్రధాని మోదీ. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను జగన్ మోసం చేశారని.. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం వైసీపీ పని చేస్తోందని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మాఫియాలకు ట్రీట్‌మెంట్‌ ఇస్తామని హెచ్చరించారు.

New Update
Prime Minister Modi: వైసీపీకి ప్రధాని మోదీ వార్నింగ్

Prime Minister Modi:లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏపీలో పర్యటించారు ప్రధాని మోడీ. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్డీఏ ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని.. వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడి చేశారు. మోడీ మాట్లాడుతూ... అనేక ఖనిజాలు కలిగి ఉన్న నేల.. రాయలసీమ అని అన్నారు. చైతన్యవంతుల యువత ప్రాంతం.. రాయలసీమ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ వికాసం.. మోదీ లక్ష్యం.. అని తెలుగులో చెప్పారు మోదీ.

ALSO READ: మందు బాబులకు షాక్.. 48 గంటలు వైన్స్ బంద్

నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ పార్టీ మోసం చేసిందని అన్నారు. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం వైసీపీ పని చేసింది అని ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని హెచ్చరించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా నీళ్లు అందించాలనేది తమ లక్ష్యం అని అన్నారు. కేంద్ర పథకం జల్‌జీవన్‌ మిషన్‌కు వైసీపీ ప్రభుత్వ సహకారం లేదని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు