Tomato price: దిగొచ్చిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే.?

ఇటీవల అకాశాన్నంటిని టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. డిమాండ్‌ కంటే సప్లై అధికంగా ఉండటంతో నిల్వ చేసిన టమాటాలు కుళ్లిపోతున్నాయి.

New Update
Tomato price: దిగొచ్చిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే.?

తెలుగు రాష్ట్రల్లో ఇటీవల ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో కిలో టమాటా 200 రూపాయలుగా పలుకగా.. ప్రస్తుతం కిలో టమాటా 20 రూపాయలుగా పలుకుతోంది. డిమాండ్‌ కంటే సరఫరా అధికంగా ఉండటంతో మార్కెట్‌లో పంటను కొనేవారు లేకపోవడంతో టమాటాలు కుళ్లిపోతున్నాయి. దీంతో టమాటాను కొనుగోలు చేయడానికి దళారులు ముందుకు రావడంలేదు. దీంతో రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చిన పంట అమ్ముడుపోక పోవడంతో అక్కడే పారబోస్తున్నారు.

గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో క్వింటా టమాటా ధర 200 రూపాయలుగా మాత్రమే పలికింది. దీంతో ఆరుకాలం కష్టపడి పంటను పండించి, మార్కెట్‌కు తీసుకువచ్చిన రైతుల శ్రమ కన్నీటి పాలు అవుతోంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో సైతం కేజీ టమాటా 3 రూపాయలుగా పలుకుతోంది. టమాటాకు ధర లేకపోవడంతో రైతులు టమాటాలను నిల్వ చేస్తున్నారు. కానీ రేట్లు ఎప్పుడు పెరిగేది తెలియడం లేదు. అంతే కాకుండా అసలు టమాటా ధరలు పెరుగుతాయా అనే సందేహం కలుగుతోంది.

కాగా గతంలో టమాటా ధరలు కేజీ రూ.200 నుంచి 220 మధ్య పలికాయి. దీంతో టమాటా రైతులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొంతకాలంగా నష్టాలు చూసిన రైతులు ధరల పెరుగుదలతో లాభాలు అర్జించారు. అంతే కాకుండా టమాటా రైతులు కోటీశ్వరులు అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటాలకు సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. టమాటా లారీ రోడ్డు ప్రమాదానికి గురైతే పోలీసులు సీఎం వస్తే ఎలా పకడ్భందీగా ఉంటారో.. ఆ విధంగా టమాటాలకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు లాభాలను అర్జిస్తున్నాడనే అక్కసుతో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బోడిమలదిన్నెకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతును దుండుగులు హత్య చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు