Modi: ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఏన్డీఏ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోడీ అందించిన మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన రాష్ట్రపతి.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీని ఆహ్వానించారు. జూన్ 9న మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు.

New Update
Modi: ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Modi Meets President Droupadi Murmu: ఏన్డీఏ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. శుక్రవారం ఇటీవల గెలిచిన ఎన్డీఏ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ.. ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని రాష్ట్రపతికి అందించారు. దీంతో ఎన్డీఏ మిత్ర పక్షాల తీర్మానాన్ని పరిశీలించిన ద్రౌపది ముర్ము.. మోడీని కేంద్రంలోని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూన్ 9న తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఇక ఆదివారం మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనుండగా.. మోడీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 290 పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ కొట్టింది.

Also Read: మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక అతిథులు.. లిస్ట్ చూస్తే ఆశ్యర్యపోతారు!

Advertisment
తాజా కథనాలు