Telangana Elections: ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రారంభం.. ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు..

రేపు (గురువారం) జరగనున్న ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

New Update
Telangana Elections: ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రారంభం.. ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు..

అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమైపోయింది. రేపు (గురువారం) జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌తో సహా.. అన్ని జిల్లాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే డీఆర్‌సీ కేంద్రాలు పోలీస్‌ సిబ్బంది చేరుకున్నారు. ఇక ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు. మరోవైరు బుధవారం సాయంత్రం నాటికి పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరకోనున్నారు. యూసుఫ్‌గూడ, గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన డీఆర్‌సీ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.


Also read: మళ్లీ అధికారం మాదే.. కొడంగల్, హుజూరాబాద్ లోనూ గెలుస్తున్నాం: కేటీఆర్ సంచలన లెక్కలివే!

ప్రస్తుతం తెలంగాణలో 35,655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 1.85 లక్షల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. అలాగే 27,094 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పోలింగ్‌ ప్రక్రియ పరిశీలనకు 22వేల మంది అబ్జర్వర్లు, స్క్వాడ్లను నియామకం చేశారు. ఇదిలా ఉండగా రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. ఇక డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Also Read: 3.26 కోట్ల ఓటర్లు.. 2,290 అభ్యర్థులు.. 35,655 పోలింగ్ కేంద్రాలు: తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు