Pregnant: గర్భధారణ సమయంలో వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల ప్రయోజనాలున్నాయా? గర్భధారణ సమయంలో స్త్రీలను వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది గర్భిణీ స్త్రీల శరీరానికి రక్షణకవచంగా పని చేసి తల్లి, బిడ్డకు హాని కలిగించే ఏదైనా ఆహార పదార్థాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 31 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pregnant: గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణం. దాదాపు ప్రతి స్త్రీ ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఉదయం వికారం, వాంతులు ఉంటాయి. దీని వల్ల చాలా మంది ఉదయం పూట ఏమీ తినరు. వాంతుల కారణంగా ఆహారం తినడానికి ఇష్టపడరు. కొందరు స్త్రీలు గర్భం దాల్చిన మూడు నెలల పాటు సరిగ్గా ఆహారం కూడా తీసుకోరు. ఏ ఆహారం చూసినా వికారం, వాంతులు వస్తుంటాయి. కొందరు తిన్న ఆహారాన్ని వెంటనే వాంతులు చేసుకుంటూ ఉంటారు. వాంతులు ఎందుకు వస్తాయి?: గర్భధారణ సమయంలో స్త్రీలను వేధించే మార్నింగ్ సిక్నెస్ వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది గర్భిణీ స్త్రీల శరీరానికి రక్షణకవచంగా పని చేస్తుందంటున్నారు. ఇది తల్లి, బిడ్డకు హాని కలిగించే ఏదైనా ఆహార పదార్థాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. వాంతులు, వికారంతో గర్భస్రావానికి సంబంధం ఉందా?: గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో వాంతులు లేదా వికారం వంటి సమస్యలను ఎదుర్కొన్న స్త్రీలలో గర్భస్రావాలు, డెలివరీ సమస్యలు తక్కువగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్ అనేది సహజమైన ప్రక్రియ. ఇది ఒక్కో మహిళకు ఒక్కోలా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ సిక్నెస్ అంటే?: గర్భం మొదటి లక్షణాలు, సంకేతాలలో మార్నింగ్ సిక్నెస్ ఒకటి. గర్భం దాల్చిన 6 వారాల తర్వాత స్త్రీలకు మార్నింగ్ సిక్నెస్ వస్తుంది. మార్నింగ్ సిక్నెస్, వికారం లక్షణాలు రెండవ లేదా మూడవ నెలలో తగ్గుతాయి. అయితే కొంతమంది మహిళల్లో ఇది డెలివరీ సమయం వరకు ఉంటుంది. దీనిని హైపర్మెసిస్ గ్రావిడరమ్ అని కూడా అంటారు. ఇది కూడా చదవండి: పిల్లలకు ఉప్పు-పంచదారతో అన్నం పెడుతున్నారా? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #10-tips-for-better-health #helth-benefits #pregnant #pregnant-woman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి