Alluri District : రహదారులు(Roads) సరిగా లేకపోవడంతో నిండు గర్భిణి(Pregnant) ని చేతులతో మోసుకుని వస్తుండగా ఆ మహిళ మార్గం మధ్యలోనే ఆడబిడ్డ(Baby Girl) కు జన్మనిచ్చిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చీడివలస కొండ శిఖర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో వసంత అనే మహిళకు మూడో కాన్పు పురిటి నొప్పులు మంగళవారం తెల్లవారు జామున మొదలైయ్యాయి.
108 కి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అది కిలో మీటరు దూరంలోనే ఆగిపోయింది. దీంతో వసంతను చేతుల మీద మోసుకుంటూ తీసుకుని వస్తుండగా.. మట్టి రోడ్డు మధ్యలోనే కాన్పు అయిపోయింది. ఆమె కి ఆడబిడ్డ పుట్టింది. అధికంగా రక్తస్రావం(Bleeding) కావడంతో 108 సిబ్బంది కొంత వైద్యాన్ని అందించి అంబులెన్స్ లో హుకుంపేట మండం ఉప్ప ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.
గ్రామానికి రోడ్డు వేసినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ నిజానికి లేదని.. రోడ్డు లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తుందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే రోడ్డుని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి … ఐపీఎల్ కు వెళ్లి.. బాస్ కి అడ్డంగా బుక్ అయ్యింది!