Dogs: కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. 10 నిమిషాలు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Dogs: ఈ మధ్యకాలంలో వీధికుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. చాలా మంది చిన్నారులు కుక్కకాటుకు బలవుతున్నారు. కుక్కలకు సరైన సమయంలో ఇంజెక్షన్లు వేయించాలి. లేకుంటే ఆ కుక్కలు కరిస్తే రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కుక్కకాటు గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి? చాలామంది ఇళ్లలో పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కలను కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటున్నారు. అయితే సమయానికి ఇంజెక్షన్లు వేయించకపోవడం వల్ల అవి కరిస్తే రేబిస్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. అయితే వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. పెంపుడు కుక్కలకు అయితే ఇంజెక్షన్లు వేయిస్తాం. కానీ వీధికుక్కలను పట్టించుకునేవారే ఉండరు. అయితే కుక్క కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. ఏటా అనేక కేసులు నమోదవుతున్నాయి. కుక్క కరిస్తే 14 ఇంజెక్షన్లు అవసరమా? కుక్క కరిస్తే కడుపులో 14 ఇంజెక్షన్లు వేస్తారని మనం తరచుగా వింటుంటాం. 14 ఇంజెక్షన్లు అవసరం లేనప్పటికీ కుక్క కాటులతో జాగ్రత్తగా ఉండాలి. కుక్కలను పెంచుకోవడం కొందరికి ఇష్టమైతే, కుక్కలంటే విపరీతమైన భయం మరికొంతమందికి. ఎందుకంటే కుక్కల పదునైన పళ్లను చూసి భయపడడం సహజం. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రథమ చికిత్సగా ఉపయోగించగల కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం. గాయాన్ని కడగాలి: కుక్కకాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని నీళ్లు, తేలికపాటి సబ్బుతో కడగాలి. ఒక పది నిమిషాల పాటు కడిగితే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్రీమ్ రాయాలి: రేబిస్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి గాయాన్ని నీటితో కడిగి ఆరబెట్టిన తర్వాత యాంటీ బయోటిక్ క్రీమ్‌ను రాయాలి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఒక వేళ క్రీమ్ అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ లేదా ఉప్పును కూడా రాయవచ్చని నిపుణులు అంటున్నారు. టీకాలు వేయించుకోండి: కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ప్రథమ చికిత్స తర్వాత డాక్టర్‌ను సంప్రదించి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: మహా శివరాత్రి నాడు శివుడికి ప్రసాదంగా వీటిని పెట్టండి.. ఎంతో మంచిది! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #health-care #dogs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి