Health Tips: పేస్‌మేకర్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుండెకు శస్త్రచికిత్స తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి. పీస్ మేకర్ ఆపరేషన్ తర్వాత విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి, సొంత వైద్యం అస్సలు వద్దు, బిగుతుగా ఉండే ధరించకండి. ప్రతిరోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యానికి మంచిది. By Vijaya Nimma 20 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి గుండె శస్త్రచికిత్స తర్వాత కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాంతకం అవుతుంది. వాల్వ్ రీప్లేస్‌మెంట్ నుంచి పేస్‌మేకర్, ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె సరిగ్గా పనిచేయనప్పుడు లేదా కొట్టుకోవడంలో ఇబ్బంది ఏర్పడినప్పుడు పేషెంట్‌కు పేస్‌మేకర్ సర్జరీ అవసరమవుతుంది. పేస్‌మేకర్ శస్త్రచికిత్స తర్వాత రోగి ఆహారం, జీవనశైలి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పేస్‌మేకర్ సర్జరీ తర్వాత ఎలా ఉండాలి?: గుండె వైఫల్యం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సందర్భాల్లో పేస్‌మేకర్లను ఉపయోగిస్తారు. గుండెను సక్రమంగా కొట్టుకునేలా చేయడం దీని పని. పేస్‌మేకర్ అనేది గుండె చుట్టూ ఉంచబడిన ఒక రకమైన పరికరం. హృదయ స్పందన సక్రమంగా లేనప్పుడు, ఈ పరికరం గుండెకు సంకేతాలను పంపుతుంది, హృదయ స్పందనను సరిచేయడంలో సహాయపడుతుంది. పేస్‌మేకర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రోగి చాలా విషయాలపై శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పేస్‌మేకర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత రోగి అధిక అయస్కాంత తరంగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పేస్‌మేకర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అజాగ్రత్తగా ఉంటే అది పని చేయడం ఆగిపోవచ్చు. పేస్‌మేకర్ శస్త్రచికిత్స తర్వాత ఈ విషయాలు గుర్తుంచుకోండి: 1. బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి: పేస్‌మేకర్ శస్త్రచికిత్స తర్వాత రోగులు భారీ వస్తువులను ఎత్తకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల గుండె, పేస్‌మేకర్‌పై ఒత్తిడి పెరిగి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పేస్‌మేకర్ ఇంప్లాంట్ తర్వాత 6 నెలల పాటు ఎలాంటి బరువైన వస్తువులను ఎత్తకుండా ఉండాలి. 2. విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి: పేస్‌మేకర్ శస్త్రచికిత్స తర్వాత ఆర్క్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ జనరేటర్లు, కార్ ఇగ్నిషన్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఒక వేళ మీరు ఇలాంటి పరికరాలతో పనిచేస్తే పేస్‌మేకర్ పనిచేయకుండాపోతుంది. 3. ప్రతిరోజూ కొంత సమయం నడవండి: పేస్‌మేకర్ శస్త్రచికిత్స తర్వాత రోగులు ప్రతిరోజూ కొంత సమయం పాటు మంచి వాతావరణంలో నడవాలి. నడక కోలుకోవడానికి సహాయపడుతుంది, గుండెకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. 4. సొంత వైద్యం వద్దు: పేస్‌మేకర్ సర్జరీ తర్వాత వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా మందులు తీసుకోకూడదు. ఈ సర్జరీ తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడాలి. 5. మరీ బిగుతుగా ఉండే బట్టలు వేసుకోకండి: పేస్‌మేకర్ సర్జరీ తర్వాత చాలా బిగుతుగా ఉండే దుస్తులను ధరించకుండా ఉండాలి. మరీ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల పేస్ మేకర్ అమర్చిన ప్రదేశంలో కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పేస్‌మేకర్ సర్జరీ చేసిన వెంటనే రోగి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత 3 నెలల పాటు డాక్టర్ సూచించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. పేస్‌మేకర్ సర్జరీ తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే సమస్య మరింత పెరుగుతుంది. ఇది కూడా చదవండి: వాలెంటైన్స్ డే రోజున మీ బాయ్‌ఫ్రెండ్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #heart-disease #heart #pacemaker మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి