హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని హస్టల్‌లో ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం తెలంగాణలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గ్రూప్ పరీక్షలు వాయిదా పడటంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రవళిక ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమేనని తేల్చి చెప్పారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి శివరాం రాథోడ్ పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ నేపథ్యంలో శివరాం రాథోడ్ కోర్టులో లొంగిపోయాడు. తాను లొంగిపోతున్నానంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్‌పై దాఖలు చేశాడు. నాంపల్లి 9 మెట్రోపాలియన్ న్యాయమూర్తి ఎదుట అతడు లొంగిపోయాడు.
ఇదిలా ఉండగా.. ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆర్ సర్కారే కారణం అంటూ విమర్శలు చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో ప్రేమ వ్యవహారం అని తేలడంతో.. పోలీసులు శివరా రాథోడ్ కోసం పలు రాష్ట్రాల్లో వెతికారు. చివరికి పూణెలో అతడ్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో శివరాం రాథోడ్ కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ప్రవళిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. నిరుద్యోగులు మాత్రం ప్రవళిక గ్రూప్ పరీక్షలకు దరఖాస్తు చేసిందని.. పరీక్ష వాయిదా పడటంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని బీఆర్ఎస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.