Pravalika Suicide Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన శివరాం..
ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి శివరాం రాథోడ్ పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. చివరకి తాను లొంగిపోతున్నానంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్‌పై దాఖలు చేశాడు శివరాం.