Prashanth Kishore On Elections Results: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇటీవల ఏపీ ఎన్నికల ఫలితాలపై అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని.. వైసీపీ (YCP) ప్రభుత్వం ఓడిపోతుందని RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపింది. అయితే ఆయన ఇటీవలే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు కూడా ఇచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ నెటిజన్ పోస్టుకు ప్రశాంత్ కిషోర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
' నీరు తాగడం మంచిది. ఎందుకంటే అది శరీరాన్ని, మెదడును హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. నా ఎన్నికల ఫలితాల అంచనాలపై ఎవరైతే కలవర పడుతున్నారో.. వాళ్లు జూన్ 4న తప్పనిసరిగా తగినన్ని నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలంటూ' పీకే వ్యంగ్యస్త్రాలు విసిరారు. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలంటూ పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఆయన కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది. మీరు హిమాచల్ ప్రదేశ్ విషయంలో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు.
ఈ క్రమంలో.. ప్రశాంత్ కిశోర్ గ్లాసు నీళ్లను గడగడా తాగేసినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రస్తావించాడు. ప్రశాంత్ కిశోర్ నీరుగారిపోయాడు అనే అర్థం వచ్చేలా ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపైనే ప్రశాంత్ కిశోర్ ఘాటుగా స్పందించి తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read: సినిమా స్టైల్లో హస్పిటల్లోకి దూసుకొచ్చిన పోలీసు వాహనం!