Prashanth Kishore : 'జన్‌ సురాజ్‌' అప్పుడే రాజకీయ పార్టీగా మారుతుంది: పీకే

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Prashanth Kishore : 'జన్‌ సురాజ్‌' అప్పుడే రాజకీయ పార్టీగా మారుతుంది: పీకే
New Update

Jan Suraaj : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (Prashant Kishor) పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్‌ (Bihar) లో తాను ప్రారంభించిన జన్‌సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనునట్లు ప్రశాంత్‌ కిషోర్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక (Assembly Elections) ల్లో కూడా పోటీ చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్ కిషోర్‌ ఇందుకోసం కసరత్తులు చేయనున్నారు. ముందుగా అక్టోబర్ 2 కన్నా ముందు జన్‌సురాజ్‌ తమ నేతలతో కలిసి ఎనిమిది రాష్ట్రస్థాయి సమామేశాలను నిర్వహించనుంది. ప్రశాంత్‌ కిషోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు.

Also Read: ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు!

జన్‌సురాజ్‌ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్ కిశోర్‌ సుధీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే దృష్టి పెట్టి ప్రసంగం చేశారు. అయితే విపక్ష పార్టీ అయిన ఆర్జేడీ.. తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు పెట్టుకోవద్దని ఓ అంతర్గత సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో బిహార్‌లో బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమని చూసి భయపడుతోందంటూ జన్‌సురాజ్‌ సంస్థ సెటైర్లు వేసింది.

Also Read: చోరీకి గురైన ఫోన్లను పట్టుకోవడంలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం

#telugu-news #bihar #prashant-kishor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe