Karnataka: ఎట్టకేలకు లైగింక ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ప్రస్తుతం తాను బెంగళూరులో లేనందున సీట్ విచారణకు హాజరు కాలేకపోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇందుకోసం మరో వారం రోజులపాటు సమయం కావాలని కోరారు. అలాగే సీట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. ఇక ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, బెంగళూరు సీఐడీతో తమ న్యాయవాది C.I.Dతో మాట్లాడినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే నిజం బయటకు వస్తుందని, తాను కడిగిన ముత్యంలా బయటపడతానన్నారు.
డ్రైవర్‌గా పనిచేసిన యువకుడి వల్లే..
ఇక హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. దీంతో ఎంపీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జేడీఎస్ ప్రకటించింది. అలాగే ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించగా.. మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యాలకు పాల్పడిన వీడియోలు ఎలా బయటకు వచ్చాయనేది చర్చనీయాంశమైంది. గతంలో ఆయన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన యువకుడు, ఓ బీజేపీ నాయకుడు దీని వెనుకు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: Salman Khan: హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఫైరింగ్.. నిందితుడు సూసైడ్
కర్ణాటక మహిళా కమిషన్ అభ్యర్థన..
ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈనెల 26న కర్ణాటకలో తొలిదశలో భాగంగా 14 సీట్లకు పోలింగ్ జరిగిన స్థానాలలో హసన్ సీటు కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ జరిగిన తర్వాత రోజు రేవణ్ణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో వీటిపై విచారణ చేపట్టారు పోలీసులు. కర్ణాటక మహిళా కమిషన్ అభ్యర్థన మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తు చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక ఏడీజీపీ పీకే సింగ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆయన కార్యాలయ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేశారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవె గౌడ మనవడే ప్రజ్వల్ రేవణ్ణ. ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కర్ణాటక అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు.