Telangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం.

ఎన్నికల కోడ్ ముగిసిందని ఈసీ అనౌన్స్ చేసింది. దీంతో తెలంగాణలో మళ్ళీ తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచే ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి తెలిపారు.

New Update
Telangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం.

Prajavani Starting In Telangana : తెలంగాణ (Telangana) లో ప్రజావాణి మళ్ళీ మొదలు కానుంది. ఈరోజు నుంచి ఈ కార్యక్రమం పునఃప్రారంభం. ప్రజల దగ్గర నుంచి అర్జీలను ఇక మీదట ఎటువంటి అంతరాయం లేకుండా తీసుకుంటామని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి (Dr. G. Chinna Reddy) తెలిపారు. ఎన్నికల మోడ్ ఆఫ్ ఆఫ్ కండక్ట్ ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాక ఈసీ ఎన్నికల కోడ్ విధించింది. దీంతో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు కోడ్ ముగియడంతో మళ్ళీ ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో కొనసాగుతుందని చిన్నారెడ్డి వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ ఉంది. మొదటి నుంచి ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ప్రజల నుంచి ప్రజావాణిలో వచ్చిన వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వర పరిష్కారాలు చూపాలని కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల మరమ్మతులు, ఇతర వివరాలపై వెంటనే నివేదిక అందజేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

Also Read:విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్

Advertisment
తాజా కథనాలు