6 Guarantees Applications : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2 రోజులు దరఖాస్తుల ప్రక్రియ బంద్ కానుంది. రేపు, ఎల్లుండి దరఖాస్తులకు సెలవు ప్రకటించింది. రేపు డిసెంబర్ 31, ఎల్లుండి కొత్త సంవత్సరం కావడంతో 2రోజుల పాటు దరఖాస్తులకు అధికారిక సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ 2వ తేదీ నుంచి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనుంది. 28న మొదలైన దరఖాస్తుల స్వీకరణ 2రోజుల సెలవులు తీసేస్తే 8 రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.
ALSO READ: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?
ప్రజాపాలన కార్యక్రమంలో మొదటి రోజు కంటే రెండో రోజే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,12,862 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,23,862 దరఖాస్తులు వచ్చాయని.. జిహెచ్ఎంసీ(GHMC), పట్టణ ప్రాంతాల్లో నుంచి మొత్తం 4.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. తొలి రోజున రాష్ట్రవ్యా ప్తంగా 7.46 7468 లక్షల దరఖాస్తులు వస్తే రెండో రోజున 8.12 లక్షలు వచ్చినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రెండు రోజుల్లో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో పల్లెల నుంచి 6.12 లక్షలు వస్తే, పట్టణాల నుంచి 9.46 లక్షలు వచ్చినట్లు తెలిపారు.
తొలి రోజున వచ్చిన దరఖాస్తులు..
* గ్రామాల నుంచి: 2,88,711
* పట్టణాల నుంచి: 4,57,703
* మొత్తం: 7,46,414
రెండో రోజు:
* గ్రామాల నుంచి: 3,23,862
* పట్టణాల నుంచి: 4,59,000
* మొత్తం: 8,12,862
రెండు రోజుల్లో వచ్చినవి :
* గ్రామాల నుంచి: 6,12,573
* పట్టణాల నుంచి: 9,46,703
* మొత్తం: 15,59,276