Praja Palana Applications: తెలంగాణలో మరోసారి ప్రజాపాలన చేపట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ప్రజాపాలన నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మరోసారి సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 'అభయహస్తం' గ్యారంటీ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రేషన్ కార్డు (Ration Card), హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించనుంది. రాష్ట్రంలో పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో కూడిన హెల్త్ కార్డులను (Health Card) ప్రతీ పౌరుడికి అందించేందుకు క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP Police Jobs: ఏపీలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. మరో 2, 3 రోజుల్లోనే..!
ఈ మేరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించేందుకు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాలతోపాటు ప్రస్తుతం కలెక్టరేట్‌లోనూ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వంటగ్యాస్, జీరో విద్యుత్తు బిల్లు అమలుకాని వారు మరోసారి అప్లై చేసుకోవచ్చు. అద్దె ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి మారితే సదరు మీటరు నంబరును మార్చుకునేందుకు అవకాశం ఉంది.
ఉస్మానియా హాస్పిటల్ గోశామహల్ కు..
అలాగే అధికారులతో సమీక్షలో.. ఉస్మానియా హాస్పిటల్ ను గోశామహల్ కు తరలించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్ లను రూపొందించాలని, వచ్చే యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారును ఆదేశించారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్ లు ఉండేలా చూడాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. గోశామహల్ సిటీ పోలీస్ ఆకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని పలు కీలక సూచనలు చేశారు.