/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Public-Blessing-Assembly-in-Ashwaraopeta-Constituency-tomorrow-jpg.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు 50వేల మంది సభకు హాజరయ్యేందుకు రెండు రోజులుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వైపు వాహనాల పార్కింగ్, మరో వైపు హెలిప్యాడ్ నుంచి 500మీటర్ల వద్ద బహిరంగ సభా వేధికలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే బీఆర్‌ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సభకు పెద్దఎత్తున జనాన్ని తరలించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సుభ్యుడు బండి పార్ధసారథి మాట్లడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఈనెల 13న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలన్నారు. ఇవాళ దమ్మపేటలో నియోజకవర్గ ముఖ్యకార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన ప్రజలతో మాట్లడారు. సభకు ప్రతీ గ్రామం నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 13న సీఎం కేసీఆర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి పార్ధసారథి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దమ్మపేటలో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వదా సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కల్లూరు సభలో అశ్వారావుపేట వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తే మన అశ్వారావుపేట అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ ఉద్దేశంతో మీరే స్వయంగా అశ్వారావుపేట రావాలని ఒప్పించడంతో నియోజకవర్గ ప్రజా ఆశీర్వదా సభ పెట్టడానికి ఒప్పుకున్నారని బండి పార్థసారథిరెడ్డి తెలిపారు. ప్రజా ఆశీర్వదా సభ విజయవంతం చేయాలని అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. సభ విజయవంతంగా కొనసాగడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలని పార్థసారథిరెడ్డి కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు అందరికి అందుబాటులో ఉండాలంటే అందరికి అనువైన ప్రదేశం దమ్మపేట కావడంతో ఈ ప్రజా ఆశీర్వదా సభ ఏర్పాటు చేశామన్నారు.