Prachi Nigam: తనపై ట్రోలింగ్ చేసేవారికి బుద్ధిచెప్పిన ప్రాచీ..

ఉత్తరప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ప్రాచీ నిగమ్‌పై ట్రోలింగ్స్‌ రావడంతో.. తాజాగా ఆమె స్పందించింది. ఇక్కడ నాకొచ్చిన మార్కులు ముఖ్యం కానీ.. ముఖం కాదంటూ ధ్వజమెత్తింది. అందంగా ఉండడని చాణక్యుడిని కూడా వేధించారని కానీ ఇవేమి ఆయనపై ప్రభావం చూపలేవని పేర్కొంది.

Prachi Nigam: తనపై ట్రోలింగ్ చేసేవారికి బుద్ధిచెప్పిన ప్రాచీ..
New Update

Prachi Nigam UP Topper Responded For Trolls:ఇటీవల ఉత్తకరప్రదేశ్‌లో 10వ తరగతి ఫలితాలు విడుదల కావడంతో.. 98.5 శాతంతో స్టేట్ టాపర్‌గా నిలిచిన 'ప్రాచీ నిగమ్' అనే బాలిక ట్రోలింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఆమె చిత్రాలు మీడియాలో కూడా వచ్చాయి. హర్మోన్ల కారణంగా ఆమె ముఖంపై అవాంఛిత రోమాలు (Unwanted Hair) ఉండటంతో ఆమెపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఆమె దీనిపై స్పందించింది.

ముఖం కాదు మార్కులు ముఖ్యం

కొన్ని మార్కులు తగ్గినా బాగుండేదని.. తనుకు సోషల్ మీడియాలో ఈ వేధింపులు తప్పేవని ప్రాచీ.. ఓ మీడియా సంస్థకు చెప్పింది. నన్ను కొందరు ట్రోల్ చేసినప్పటికీ అదే సమయంలో చాలామంది నాకు మద్దతుగా నిలిచారని.. వాళ్లందరికి కృతజ్ఞతలు అని చెప్పింది. ఇక్కడ నాకొచ్చిన మార్కులు ముఖ్యం కానీ.. నా ముఖం కాదు అంటూ ధ్వజమెత్తింది. అందంగా ఉండడని చాణక్యుడిని (Chanakya) కూడా వేధించారని.. అయినప్పటికీ ఇవేమి అతడిపై ప్రభావం చూపలేదంటూ ధీటుగా సమాధానం ఇచ్చింది.

Also read: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు..

షేవింగ్‌ కంపెనీపై విమర్శలు

ఇదిలాఉండగా.. ఓ వైపు ప్రాచీ నిగమ్‌పై వేధింపులు వస్తుండగా.. ఓ షేవింగ్ కంపెనీ దీన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నించింది. ఆ చిన్నారికి సపోర్ట్ చేస్తున్నట్లు ఆమె ఫొటోను వాడుకొని ఓ యాడ్ ఇచ్చింది. అయితే ఈ కంపెనీ చర్యలకు ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో ఆ కంపెనీ సీఈవో స్పందించారు. తాము వాణిజ్య లక్ష్యాలతో ఈ యాడ్ ఇవ్వలేదని.. ఆమెను ప్రోత్సహించాలనేదే తమ ఉద్దేశమంటూ సమర్థించుకున్నాడు.

publive-image

ఆమె చికిత్స ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది

మరోవైపు ప్రాచీ నిగమ్ తల్లి మమతా కూడా.. తన కూతురుపై వచ్చిన ట్రోలింగ్స్‌పై స్పందించారు. ఆన్‌లైన్‌లో వేధింపులు వచ్చినప్పుడు తన కూతురుకు తాను చెప్పానని.. వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రాచీ పరిస్థితిపై వైద్యులను సంప్రదించాలనుకుంటున్న టైమ్‌లోనే పరీక్ష ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ఆమెకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పేర్కొన్నారు. అలాగే ప్రాచీపై వచ్చిన ట్రోలింగ్స్‌పై కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ఆమెతో నేరుగా మాట్లాడి అభినందించారు. చదువుపై దృష్టి అనుకున్న లక్ష్యాలు సాధించాలని సూచనలు చేశారు. ప్రియాంక భర్త రాబర్డ్‌ వాద్ర కూడా ఆ బాలికతో మాట్లాడాడు. ఆన్‌లైన్ ట్రోలింగ్స్‌ను పట్టించుకోకుండా ముందుకు సాగాలని ధైర్యం చెప్పారు.

Also read: మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు: సిద్ధరామయ్య

#national-news #telugu-news #prachi-nigam #uttar-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe