Prabhas : ప్రభాస్ కు భారీ అవమానం.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్? 'సలార్' మూవీ రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. ఫస్ట్ టైం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాకి కేవలం 6.5 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్స్ రావడం ఒక విధంగా ప్రభాస్ కి అవమానం అని చెప్పక తప్పదు. By Anil Kumar 04 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Salaar TRP Rating : పాన్ ఇండియా(PAN INDIA) స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన 'సలార్' బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి' తర్వాత వరుస ప్లాప్స్ తో డీలా పడ్డ ప్రభాస్ కి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఫుల్ రన్ లో ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి ప్రేక్షకాదరణను దక్కించుకుంది. కానీ బుల్లితెరపై మాత్రం ఎవరూ ఊహించని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ప్రభాస్ కి భారీ అవమానం 'సలార్'(Salaar) మూవీ రీసెంట్ గా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రేటింగ్స్ వివరాలు బయటికి వచ్చాయి. ఫస్ట్ టైం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాకి అతి తక్కువ రేటింగ్స్ రావడం గమనార్హం. ఈ సినిమాకి కేవలం 6.5 TRP రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. దీనికంటే ముందు ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాకి 9.5 TRP రేటింగ్ వచ్చింది. ఒక డిజాస్టర్ సినిమాకే 9.5 TRP రేటింగ్స్ వస్తే థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ అందుకొని, పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న 'సలార్' మాత్రం టీవీల్లో 6.5 రేటింగ్స్ అందుకోవడం ఫ్యాన్స్ ని ఒకింత షాక్ కి గురిచేసింది. హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్స్ రావడం ఒక విధంగా ప్రభాస్ కి అవమానం అని చెప్పక తప్పదు. Also Read : అక్కడ ఐకాన్ స్టార్ రా బాబూ.. టీ స్టెప్ వేయబోయిన ఫ్యాన్ కు ఏం జరిగిందో చూడండి! తక్కివ రేటింగ్స్ కి కారణం? 'సలార్' మూవీకి తక్కువ రేటింగ్స్ రావడంపై నెటిజన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాని థియేటర్స్ లో, అటు ఓటీటీ(OTT)లో చాలామంది చూసేసారు. దానికి తోడు సినిమా అంతా సీరియస్ మోడ్ లో ఉండడంతో రిపీట్ ఆడియన్స్ చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #tollywood #pan-india-star-prabhas #salaar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి