Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు!

ప్రభాస్‌ కొత్తి సినిమా సలార్‌ బాక్సాఫిస్‌ను షేక్ చేస్తోంది. నైజాం, సీడెడ్ ఆంధ్రాలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు ఇండియాలో 50 కోట్ల, ఓవర్ సీస్ లో 80 కోట్ల కలెక్షన్స్ మార్కును ఇప్పటికే అందుకుంది.

Salaar First Day Collections: దుమ్ములేపిన సలార్ ఫస్ట్ డే కలెక్ట్సన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు!
New Update

Salaar Collections: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరెకెక్కిన పాన్ ఇండియా ఫిలిమ్ 'సలార్'. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ భారీ అంచనాలతో ఎదురు చూస్తూ వచ్చారు. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అభిమానులలో సినిమా మరింత అంచనాలను పెంచేసింది. భారీ ఊహాగానాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే సూపట్ హిట్ టాక్ మొదలైంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను దాటేసినట్లు తెలుస్తోంది. డార్లింగ్ అభిమానులకు మంచి విజువల్ ఫీస్ట్ అన్నట్లుగా ఈ సినిమా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్ సీస్ లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం, సీడెడ్ ఆంధ్రాలో మంచి రిమార్కబుల్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సలార్ మొదటి రోజు ఇండియాలో 50 కోట్ల, ఓవర్ సీస్ లో 80 కోట్ల కలెక్షన్స్ మార్కును అందుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ దేశవ్యాప్తంగా 65 కోట్ల నుండి 70 కోట్ల షేర్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. గ్రాస్ కలెక్షన్స్ విషయానికొస్తే దేశవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ ఈజీగా వసూళ్లు చేసే అవకాశం ఉంది. మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ రీచ్ అయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 345 కోట్ల బిజినెస్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడానికి 347 కోట్ల షేర్, 650 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రైట్స్ 145 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. నైజం ఏరియాలో ఈ సినిమా రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ 66 కోట్ల డీల్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ 160 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Also Read: Salaar OTT Release: ఆ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై సలార్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

#prabhas #cinema-news #salaar-first-day-collections #salaar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe