Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతిల 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని 2025 సంక్రాంతి బరిలో దించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'రాజా సాబ్' రిలీజ్ డేట్ ఫిక్స్!?
New Update

Prabhas Fans : స్టార్ డైరెక్టర్‌ మారుతి(Maruthi) రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కలయికలో 'రాజా సాబ్'(Raja Saab) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి కొద్ది రోజులుగా ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి డేట్ ఫిక్స్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.

2025 సంక్రాంతి బరిలో..

ఈ మేరకు హారర్‌ కామెడీ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై చర్చలు జరిపారని, ప్రభాస్ , మారుతి ఇద్దరూ సంక్రాంతి(Sankranti) బరిలో దిగేందుకు మొగ్గుచూపుతున్నట్లు జోరుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ మూవీలో మలయాళ భామ మాళవికా మోహనన్‌(Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. సంజయ్‌ దత్‌, రిద్ది కుమార్‌ కీ రోల్‌ లో నటిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల కానున్న సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

#2025 #maruthi #sankranti #prabhas #raja-saab
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe