Kalki 2898 AD: 'కల్కి' ఊచకోత.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే పూనకాలే!

ప్రభాస్‌ ‘కల్కి2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రెండవ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. రెండో రోజు తెలుగులో రూ.25.65 కోట్లు, హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది. డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

New Update
Kalki 2898 AD: 'కల్కి' ఊచకోత.. రెండో రోజు కలెక్షన్లు చూస్తే పూనకాలే!

Kalki 2898 AD Box Office Collections: స్టార్ కాస్ట్ ప్రభాస్ (Prabhas), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫిల్మ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం 'కల్కి 2898 ఏడీ' తొలిరోజు హిందీలో 27.5 కోట్లు వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా రూ.190 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో మొత్తం రూ .95 కోట్లు వసూలు చేసింది.

కల్కి డే 2 కలెక్షన్స్

ఇక రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది కల్కి. రెండవ రోజు కలెక్షన్ విషయానికొస్తే.. రూ.54 కోట్లు కలెక్ట్ చేసినట్లు సెక్నిక్ రిపోర్ట్ తెలిపింది. తెలుగులో రూ.25.65 కోట్లు, హిందీలో రూ.22.5 కోట్లు వసూలు చేసింది. 'కల్కి 2898 ఏడీ' డే 2 ఇండియాలో మొత్తం రూ.149.3 కోట్లు వసూలు చేసింది. ఇందులో అత్యధికంగా తెలుగు వెర్షన్ రూ.91.45 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత హిందీలో 45 కోట్లు రాబట్టింది.

బాహుబలి, కేజీఎఫ్ రికార్డ్స్ బ్రేక్

కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ కేజీఎఫ్, బాహుబలి1,సాహో, జవాన్ తో సహా పలు పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ 250 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇదే జోరు కొనసాగితే ఈ సినిమా 'పఠాన్', 'జవాన్', 'జైలర్', బాహుబలి వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

Also Read: Kalki 2898 AD: యూట్యూబ్ లో కల్కి 'టా టక్కర' ఫుల్ వీడియో సాంగ్ ... ప్రభాస్, దిశా పటాని అదరగొట్టేశారు ..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు