Releasing Soon : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్(Salaar) సినిమా మరి కొద్ది రోజుల్లో థియేటర్లలో మోత మోగించబోతుంది. కొత్త కొత్త కాన్సెప్టులతో సినీ జనాలను తనవైపు తిప్పుకున్న హోంబలే ఫిలిమ్స్ రూపొందించిన ''సలార్ సీజ్ ఫైర్'' మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తుండగా..రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా గురించి ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని అన్ని పాత్రల మధ్య అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయని, ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి పాత్రను అయితే చూడాలనుకుంటున్నారో..వారికి ఈ సినిమాలో నేను అలానే కనిపిస్తానని ఆయన వివరించారు.
ముందు నీల్ నాతో సినిమా చేయాలనుకున్నప్పుడు.. నేను ఆయన కూర్చొని సినిమా గురించి విపరీతంగా చర్చించామని..కథకి తగినట్లుగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి అన్న విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కథకు తగినట్లుగానే బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.
ఆ సమయంలో నేను చెప్పిన కొన్ని విషయాలను ప్రశాంత్ ముందు ఉంచగా వాటిలో కొన్నిటిని నీల్ తీసుకున్నారు. ఈ సినిమాలో నీల్ నన్ను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను ముందుగానే నాకు తెలిపేవాడు. ఇద్దరం కలిసి సరదగా సినిమాని పూర్తి చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 21 సంవత్సరాలు అయ్యాయి. ఈ సినిమా మాత్రం షూటింగ్ కి వెళ్లాలనే ఆలోచనతో కాకుండా నీల్ తో సమయం గడిపేందుకే సినిమా చిత్రీకరణకు వెళ్లేవాడిని అని చెప్పుకొచ్చారు.
ఇన్ని సంవత్సరాల సినీ ప్రయాణింలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు. సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకే మేం మంచి ఫ్రెండ్స్ గా మారాం. సినిమాని చాలా రిలాక్స్‌గా పూర్తి చేస్తాడు. షూటింగ్ లో చాలా ఎంజాయ్ చేసేవాడిని ..తరువాత షాట్ కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదు. సెట్స్‌లో శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ కలిశామంటే ఎంతో సరదాగా ఉండేది. షూట్ కోసం మేము ఎప్పుడు వెయిట్ చేయలేదు.
సినిమా మొదటి షెడ్యూల్ మొదలైనప్పుడు అసలు ఎలా సెట్స్ లోకి అడుగు పెట్టానో గుర్తు లేదు. నన్ను చిత్ర బృందం మొత్తం చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడింది లేదు. కేవలం కండలు ఒక్కటి పెంచాను అంటూ వివరించారు.
ఆయన చెప్పినట్టు నేను మారాను, అది నాకు సాధారణమైన విషయం మాత్రమే. గత 21 ఏళ్లలో నేను మారిన దానితో పోల్చుకుంటే ఈ సినిమా కోసం జరిగిన మార్పులు చాలా సాధారణమైన విషయమే’’ అని అన్నారు ప్రభాస్. సినిమాలో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కిటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు.
సినిమాకి సంబంధించి ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా పై అటు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తరువాత ప్రభాస్ కి అనుకున్న స్థాయిలో హిట్ రాలేదు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also read: భారతీయులకు వీసా అక్కర్లేదు..ఆ దేశం కీలక నిర్ణయం!