Prabhas Hanu Raghavapudi Movie: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్

New Update
Prabhas Hanu Raghavapudi Movie: ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్

ప్రభాస్-హను రాఘవపూడి మూవీ కి లైన్ క్లియర్, సీతారామం తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి. సీతారామం చిత్రానికి గాను జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi). తాను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'అందాల రాక్షసి’ తోనే అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకొని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మూడు చిత్రాలు అంతంత మాత్రంగానే ఆడాయి.

ఇప్పుడాయన పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas)తో ఓ చిత్రం తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే విషయాన్నీ ఓ వేడుకలో ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ సినిమా మరో రొండు నెలల్లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

అయితే ప్రభాస్ లైనప్ కూడా మాములుగా లేదు. సలార్ పార్ట్ 1 తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు కల్కి 2898 AD తో రాబోతున్నాడు. కల్కి షూటింగ్ పూర్తి అయ్యి తాజా గా మారుతి దర్శకత్వం లో రాజా సాబ్ అనే కొత్త సినిమా షూటింగ్ లో హాజరవుతున్నారు. అయితే ఆ తర్వాత ప్రభాస్ సలార్ పార్ట్ 2 ని మొదలు పెడతారా లేదంటే సందీప్ వంగతో కలిసి స్పిరిట్ మూవీని మొదలు పెడతారా అనేది తెలియాల్సి ఉంది.

Read Also: అయోమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు!

పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రభాస్-హను మూవీ | Prabhas Hanu Raghavapudi Movie

ఇక హను రాఘవపూడి ప్రభాస్ సినిమా విషయానికి వస్తే ఇది చారిత్రక అంశాలతో నిండిన ఫిక్షనల్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఉంటుందని హను రాఘవాపుడి తెలిపారు. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ ఇప్పటికే మూడు పాటల్ని సిద్థం చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.

Read Also: పవన్ కోసమే బన్నీ అలా చేశాడా?

Advertisment
తాజా కథనాలు