జూన్ 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ నుంచి స్పీకర్ ఉంటారని.. ఇటీవల జేడీయూ స్పష్టం చేసింది. దీంతో ఈసారి కూడా ఓం బిర్లా స్పీకర్ రేసులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జూన్ 24న పార్లమెంటులో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 25న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 26న ఎన్నిక ఉండే ఛాన్స్ ఉంది. బీజేపీకి ఈసారి మెజార్టీ సీట్లు రాకపోవడంతో సరైన వ్యక్తి కోసం చూస్తున్నట్లు సమాచారం.
Also Read: బీజేపీపై ఆర్ఎస్‌ఎస్ ఘాటు విమర్శలు..
2014లో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సుమిత్రా మహాజన్, అలాగే 2019లో ఓం బిర్లాను ప్రధాని మోదీనే ఎంపిక చేశారు. మరి ఈసారి కూడా మోదీనే ఎంపిక చేస్తారా లేదా బీజేపీ పెద్దలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోసారి ఓం బిర్లాను స్పీకర్ చేసే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తున్నప్పటికీ.. కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ అవకాశం ఎవరికి దక్కనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సింది. ఇదిలాఉండగా.. జూన్ 27 నుంచి జూలై 3వ తేదీ వరకు పార్లమెంటులో రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి.
Also Read: యోగి ఆదిత్యనాథ్‌తో.. RSS అధినేత మోహన్ భగవత్ భేటీ!