Ethiopia: భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 157 మంది మృతి

ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నాయి.

New Update
Ethiopia: భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 157 మంది మృతి

Ethiopia Landslide: ఇథియోపిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం కొండచరియలు విరిగిపడి 157 మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇథియోపియాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు మృతి చెందారు. సమాచారం మేరకు సహాయ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారని వెలికితీస్తుండగా.. మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.

Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం ఇదే!

దీంతో అక్కడున్న ప్రజలు, సహాయక బృందాలు సైతం శిథిలాల్లో చిక్కుకున్నారు. అయితే ఇప్పటిదాకా 157 మంది మృతదేహాలను వెలికితీసినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, స్థానిక పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Also Read: భూమికి అతి సమీపంలో వజ్రాలతో పొదిగి ఉన్న గ్రహం..!

Advertisment
తాజా కథనాలు