/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/49-1-jpg.webp)
Pothina Mahesh Resigns Janasena Party: జనసేన పార్టీలో అతి ముఖ్యమైన నేతగా ఉన్న పోతిన మహేష్ ఈరోజు ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) పంపించారు. ఆశించిన టికెట్ రాకపోవడంతోనే మహేష్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు పవన్ కల్యాణ్ పోతిన మహేష్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి జనసేనను బలోపేతం కూడా చేశారు. కానీ పొత్తుల్లో భాగంగా పోతిన మహేష్‌కు టికెట్ దక్కలేదు. దీని మీద ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడి టికెట్‌ను బీజేపీ నేత సుజనా చౌదరికి దకకింది. సుజనాకు టికెట్ ఇవ్వడం మీద మహేష్ గుర్రుగా ఉన్నారు. విజయవాడ పశ్చియలో తాను అయితేనే వైసీపీని ఎదుర్కొనగలనని...ఇంకెవరైనా సరే వాళ్ళ చేతిలో ఓడిపోవాల్సిందేనని అంటున్నారు మహేష్. అసలు నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారంటూ పోతిన మహేష్ ప్రశ్నిస్తున్నారు.
బలమైన బీసీ నేత. అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన నాయకుడు.జనసేనలో గట్టి గొంతుకగా వినిపించే పోతిన మహేష్ కి టికెట్ ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ (TDP) ఎంట్రీతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. పోతిన మహేష్‌కు టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం అని పలువురు నేతలు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఐదేళ్ళుగా జనసేన కోసం మహేష్ పాటు పడుతున్నారని...టికెట్ ఈయనకే ఇస్తే గెలిచే వారని అంటున్నారు.
గత ఎన్నికల్లో బీసీ నేతగా పోతిన మహేష్ 22 వేల 367 ఓట్లు లభించాయి. టీడీపీకి వచ్చిన ఓట్లలో సగం ఓట్లు ఇవి. విజయవాడలో పశ్చిమలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే మైనారిటీలు ఉన్నారు. దీంతో ఇప్పుడు జనసేన నుంచి బయటకు వచ్చేసిన పోతిన మహేష్ బీసీల మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. మరోవైపు ఆయనకు వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయని చెబుతున్నారు. అయితే ఈరోజు మహేష్ రాజీనామా అయితే చేశారు కానీ...నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Also Read:Andhra Pradesh: వైసీపీకి మరో బిగ్ షాక్..మరో ఎమ్మెల్యే జంప్