Jobs: పోస్టల్ ఉద్యోగాల షార్ట్ లిస్ట్ అభ్యర్ధుల జాబితా విడుదల పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. మొత్తం 44, 228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదోతరగతి అర్హతతో పడిన ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. By Manogna alamuru 19 Aug 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Postal Jobs: దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తును ఆహ్వానించింది తపాలాశాఖ. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం జులై 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్ చెబుతూ ఫలితాలను విడుదల చేసింది పోస్టల్ శాఖ. మెరిట్ ఆధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేశారు అధికారులు. ఈ ఫస్ట్ లిస్ట్‌లో ఏపీ నుంచి 1355 మంది, తెలంగాణ నుంచి 981 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన అభ్యర్ధులు సెప్టెంబర్ 3లోగా ధ్రువ పత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్ధులు..ఉద్యోగం కోసం పెట్టిన ఆన్‌లైన్ అప్లికేషన్, పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో , 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం, దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రంతో పాటూ మెడికల్ సర్టిఫికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. Also Read: PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ #andhra-pradesh #telangana #postal-jobs #short-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి