Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లొ పాల్గొనండి... సెల్ఫీ అప్ లోడ్ చేయండి... ప్రజలకు మోడీ పిలుపు..!

‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా అనేది దేశ స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు.

Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లొ పాల్గొనండి... సెల్ఫీ అప్ లోడ్ చేయండి... ప్రజలకు మోడీ పిలుపు..!
New Update

Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

మోడీ ఏమన్నారు....!

మువ్వన్నెల జెండా అనేది దేశ స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ప్రతి భారతీయుడికీ మూడు రంగుల జెండాతో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందన్నారు. దేశ అభివృద్ధికి కోసం మరింత కష్టపడేలా ఆ జెండా మనకు మరింత స్ఫూర్తిని ఇస్తుందన్నారు. అందువల్ల ఈ నెల 13 నుంచి 15 వరకు భారతీయులు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని వారి ఫోటోలను హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని కోరారు.

హర్ ఘర్ తిరంగా ఉద్యమం...!

దేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చి 75వ ఏండ్లు గడిచిన సందర్బంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022లో తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా భారతీయులు జెండాలను ఎగుర వేసి వాటికి సంబంధించిన ఫోటోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు.

తిరంగా సెల్ఫీలను ఎలా అప్ లోడ్ చేయాలి...!

మొదట పౌరులు https://harghartiranga.com వెబ్ సైట్ లోకి ఎంటర్ కావాలి. అక్కడ ‘అప్ లోడ్ సెల్ఫీ విత్ ఫ్లాగ్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే ఒక పాప్ అప్ వస్తుంది. దానిపై మీ పేరు రాయాలి. అక్కడ అప్ లోడ్ చేసి.. సబ్ మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో సెల్ఫీ అప్ లోడ్ అవుతుంది.

Also Read: నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర..!

#pm-modi #selfie #flag #independence-day-2023 #tiranga #har-ghar-tiranga #har-ghar-tiranga-2023-registration #har-ghar-tiranga-2023-campaign #har-ghar-tiranga-website #post-photos-with-tiranga-pm-modi-asks-citizens
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe