Independence Day 2023: 10వేల మంది పోలీసులు..యాంటీ డ్రోన్ సిస్టమ్..ఇండిపెండెన్స్ డేకి హై సెక్యూరిటీ..!!
ఆగస్టు 15న దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఎర్రకోట చుట్టూ భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ఏజెన్సీల నుంచి అందిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా పోలీసులు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ముఖ్యమైన సంస్థల వద్ద అదనపు పికెట్లను మోహరించారు.