Posani: కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: పోసాని కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఏపీలో పవన్ సపోర్ట్ చేస్తున్నపుడు తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయాలి కదా ? ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు. By Jyoshna Sappogula 11 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Posani Krishna Murali: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీడీఎఫ్‌సీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ (CM Jagan) ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. రెండు వేర్వేరు రాష్ట్రాలు అని టీడీపీ తెలుసుకోవాలన్నారు. జనసేన (Janasena) తెలంగాణలో పోటీ చేస్తే.. టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదని నిలదీశారు. చంద్రబాబు జైల్ లో ఉంటే పవన్ ధీమాగా టీడీపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ (TDP) ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిందని ప్రశ్నించారు. Also Read: విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే మైన్స్ కుంభకోణం..సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.! చంద్రబాబు (Chandrababu) లాంటి పొలిటీషియన్ ఎక్కడైనా ఉంటారా.. కాంగ్రెస్‌కు సపోర్టు చేసే బదులు జనసేనకు సపోర్టు చేయచ్చు కదా ?అని అన్నారు. తెలంగాణలో పవన్‌ను సపోర్ట్ చేయకుండా వాడుకుంటున్న టీడీపీ.. ఏపీలో ఆయన్ని వదిలేయాలన్నారు. కాపు సోదరులకు ముందు నుంచే చంద్రబాబు ముంచేస్తాడు అని చెబుతూనే ఉన్నామన్నారు. గెలిచినా ఓడినా పొత్తులో ఉన్న పార్టీకి ఓట్లు వేయించాలి కదా అంటూ పోసాని పేర్కొన్నారు. Also Read: నాదెండ్ల మనోహర్ అరెస్ట్.. పవన్ సీరియస్ వార్నింగ్..! ఏపీ లో కూడా చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా.. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి కానీ, అధికారం మాత్రం కాపులకి ఇవ్వడని పోసాని ఆరోపించారు. తెలంగాణలో జనసేన గెలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు అడుగుతాడని..అందుకే చంద్రబాబు జనసేనకి సపోర్ట్ చేయలేదని అన్నారు. చంద్రబాబు చేసేదంతా ప్రజలకు ఇప్పటికే అర్థం అవుతుందిని పోసాని తెలిపారు. #pawan-kalyan #andhra-pradesh #telangana #chandrababu #posani-krishna-murali #posani-apfdc-chairman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి